సబ్బు, పేస్ట్‌... వాడేద్దామిలా!
close
Published : 20/09/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సబ్బు, పేస్ట్‌... వాడేద్దామిలా!

రోజువారీ ఉపయోగించే వస్తువులు, పదార్థాలకు కొన్నాళ్ల తర్వాత గడువు ముగిసిపోతుంది. అలాంటప్పుడు వాటిని వృథాగా పారేయకుండా ఉపయోగించడిలా...

టూత్‌పేస్ట్‌... గడువు ముగిసిన టూత్‌ పేస్ట్‌ను మొండి మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. గోడలపై గీసిన క్రేయాన్‌ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కాస్తంత టూత్‌పేస్ట్‌ రాసి కాసేపాగి తడి వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయి. షూస్‌పై పడిన మరకలనూ ఇది వదలగొడుతుంది.

సబ్బు... ఎక్స్‌పైరీ లేదా మిగిలిపోయిన సబ్బు ముక్కలను స్క్రూలు, బ్లేడ్స్‌ను వదులుగా చేసేందుకు వాడొచ్చు. అలాగే పాత జిప్‌లను తేలిగ్గా తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రాత్రిపూట చిన్నారుల బూట్లలో సబ్బు ముక్కలను కాగితంతో చుట్టి పెడితే మర్నాటి కల్లా దుర్వాసన దూరమవుతుంది.

షాంపూ... దీంతో ఆక్సిడైజ్‌ నగలను శుభ్రం చేయొచ్చు. అలాగే డిటర్జంట్‌లా ఇల్లు శుభ్రం చేయడంలో వాడుకోవచ్చు.

లూఫా... దీన్ని రెండు నెలలకు మించి వాడొద్దంటారు. అయితే ఆ తర్వాత దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఎస్సెన్షియల్‌ నూనె చుక్కలను దీనిపై చల్లి దుర్వాసనల వచ్చే చోట పెడితే అక్కడంతా సువాసనలు వెలువడతాయి.

వెట్‌ వైప్స్‌.. వీటికీ గడువు తేదీ ఉంటుంది. ఇది ముగిసిపోయిన తర్వాత వీటితో హ్యాండ్‌ బ్యాగులు, పర్సులను శుభ్రం చేయొచ్చు. అలాగే ఫ్యాన్‌ రెక్కలు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ను కూడా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని