Google Pixel: గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘టెన్సర్’ - google officially announce pixel 6 and pixel 6 pro coming with own soc
close
Published : 04/08/2021 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Google Pixel: గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘టెన్సర్’

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ నుంచి సరికొత్త న్యూస్‌ వచ్చేసింది. పిక్సెల్‌ సిరీస్‌లో రానున్న పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లలో సొంత ప్రాసెసర్‌ను వినియోగించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా గత ఫోన్లతో పోలిస్తే పూర్తిగా డిజైన్‌లోనూ మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేది మాత్రం వచ్చే ఏడాదే. గూగుల్‌ రూపొందిస్తున్న SoC (సిస్టమ్‌ ఆన్‌ ఏ చిప్‌)కు టెన్సర్‌గా నామకరణం చేసింది. పిక్సెల్ 6, పిక్సెల్‌ 6  ప్రో ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో గూగుల్‌ కొత్తగా డిజైన్‌ చేయించనుంది.

కొత్తగా పరిచయం చేయబోయే పిక్సెల్‌ ఫోన్ల డిజైన్‌ను సమూలంగా గూగుల్‌ మార్చేయబోతుంది. గత ఎక్స్‌ఎల్‌ మోడల్‌కు బదులు నూతనంగా ఉండేలా తయారు చేస్తుందని గూగుల్ సంస్థ డివైజెస్‌, సర్వీసెస్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ ఓస్టర్‌లాహ్ తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో డిజైన్‌ ఒకేలా ఉంటుందని తెలుస్తోంది. స్క్రీన్‌ సైజ్‌లో, కెమెరా లెన్సులు, కొన్ని ఇతర ఫీచర్లలో స్వల్ప తేడా ఉండనుంది. గత ఫోన్లతో పోలిస్తే అత్యాధునిక సెన్సార్లను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. పిక్సెల్‌ 6 ప్రో సంబంధించి డిస్‌ప్లే 6.7 అంగుళాలు, త్రీ కెమెరా సెన్సార్లు.. పిక్సెల్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే 6.4 అంగుళాలు ఉంటుంది. అయితే సంస్థ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని