పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా? - gossips on a tollywood actress comback to movies after 17 years
close
Published : 06/02/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా?

అలనాటి ముద్దుగుమ్మ రీఎంట్రీపై కథనాలు

హైదరాబాద్‌: ‘గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’ అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్‌ సరసన ‘రాఘవేంద్ర’లో నటించారు. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మరే ఇతర చిత్రంలోనూ పూర్తిస్థాయి పాత్రలో కనిపించలేదు. 2004లో విడుదలైన ‘మిస్సమ్మ’లో అన్షూ ఓ గెస్ట్‌ రోల్‌లో సందడి చేశారు.

కాగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ అంబానీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో అన్షూ కీలక పాత్రను పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. #NTR30గా పట్టాలెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ రెండో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేష్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని