NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
జోరందుకున్న ప్రచారం
హైదరాబాద్: ‘అరవింద సమేత’ తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూట్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారు. NTR30గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయంపై నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పవర్ఫుల్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
‘క్రాక్’, ‘నాంది’ చిత్రాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్ NTR30లో ఓ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు.. ‘సర్కార్’, ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ చిత్రాల్లో రాజకీయ నాయకురాలి పాత్రను పోషించి వరలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్న విషయం విధితమే. ఇక, తారక్ సినిమా విషయానికి వస్తే.. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్