Pawankalyan: పవన్‌, పూరీ హ్యాట్రిక్‌ సెట్టవుతుందా? - gossips on pawan kalyan and puri jagannadh movie
close
Published : 11/06/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawankalyan: పవన్‌, పూరీ హ్యాట్రిక్‌ సెట్టవుతుందా?

హైదరాబాద్‌: ‘బద్రి’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ చిత్రాలతో పవర్‌ఫుల్‌ విజయాలను సొంతం చేసుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దర్శకుడు పూరీజగన్నాథ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా వస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పవన్‌-పూరీ కాంబోలో ఓ విభిన్నమైన స్టోరీ రానుందంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా వీరిద్దరి ప్రాజెక్ట్‌ గురించి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కిస్తూ ఇటు సినిమా‌, అటు రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు పవన్‌కల్యాణ్‌. ఇప్పుడు ఆయన ఎంచుకునే కథల్లో కూడా సామాజిక చైతన్యంతోపాటు వైవిధ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌తో ఓ పవర్‌ఫుల్‌ సినిమా తెరకెక్కించేందుకు పూరీ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఎన్నో సంవత్సరాల క్రితం మహేశ్‌బాబు కోసం సిద్ధం చేసిన ‘జనగణమన’ కథను ఇప్పుడు పవన్‌తో తీయాలని ఆయన అనుకుంటున్నారట. ఈ మేరకు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ప్రచారం జోరందుకుంది. మరోవైపు సుమారు నాలుగేళ్లు క్రితం మహేశ్‌బాబుతో హ్యాట్రిక్‌ చిత్రంగా ‘జనగణమన’ తీయబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు పూరీ జగన్నాథ్‌. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆరంభదశలోనే ఆగిపోయింది. దీంతో పూరీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమా ఎప్పుడు? ఏ హీరోతో పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని