నెట్టింట పోస్టులు వైరల్
హైదరాబాద్: మెగా కాంపౌండ్‌కు చెందిన అగ్ర, యువ హీరోలందరూ వరుస పెట్టి ప్రాజెక్ట్‌లు ఓకే చేసేస్తున్నారు. చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉండగానే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆ హీరోలు చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించి పలు ఊహాగానాలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అలా, మెగా హీరోలకు సంబంధించిన కొన్ని భారీ ప్రాజెక్ట్‌లలో ఓ నటి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఎవరానటి? ఏమా చిత్రాలు? మీరూ ఓ లుక్కేయండి..!
నటి ఎవరంటే..!
అందం, అభినయం, డ్యాన్స్‌తో.. ఎంతో మంది అభిమానులను ‘ఫిదా’ చేసి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి. డ్యాన్స్‌షోతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ‘ప్రేమమ్’తో(మలయాళీ చిత్రం) నటిగా మారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు. ‘ఫిదా’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇక్కడ కూడా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు, తమిళ చిత్రాలున్నాయి.
మెగాస్టార్ సోదరిగా..
మెగాస్టార్ మనసును హత్తుకున్న కోలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ‘వేదాళం’. ప్రస్తుతం ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న చిరు త్వరలో ‘వేదాళం’ రీమేక్‌లో బిజీ కానున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు మెహర్ రమేశ్ టాలీవుడ్‌కు తగినట్లుగా ‘వేదాళం’ రీమేక్ పనులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన సోదరి(లక్ష్మీమేనన్) పాత్రను తెలుగులో సాయిపల్లవి చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సోదరిగా చేయడానికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పవర్‌స్టార్ సినిమాలో..
మలయాళీ సూపర్‌హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’. ఇటీవల ఈ సినిమా తెలుగు రీమేక్ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సాయిపల్లవి ఓ కీలక పాత్రలో నటించనునున్నారని సమాచారం. అంతేకాకుండా ఆమె త్వరలోనే ఈ సెట్లోకి అడుగుపెట్టనున్నారంటూ అందరూ చెప్పుకుంటున్నారు. పవన్‌కు జోడీగా ఐశ్వర్యరాజేశ్ నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో సాయిపల్లవి రానా సరసన నటిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మాతృక ప్రకారమైతే రెండు, మూడు సన్నివేశాల్లో పవన్-సాయి పల్లవి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఖాయం.
స్టైలిష్‌స్టార్ మరదలిగా..
సుకుమార్-స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక, ఈ సినిమాలో సాయిపల్లవి ఓ కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. రష్మిక సోదరిగా.. బన్నీ మరదలిగా ఈ సినిమాలో సాయిపల్లవి నటించే అవకాశాలున్నాయంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.
ఇదీ చదవండి
రణ్వీర్ను పెళ్లి చేసుకోడానికి కారణమదే: దీపిక
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’