ఆర్ట్ ఆఫ్‌ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్‌పై సినిమా  - gurudev sri sri ravi shankar’s birthday mahaveer jainlyca group announce the film
close
Published : 14/05/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్ట్ ఆఫ్‌ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్‌పై సినిమా 

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఆధ్వాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ జీవితాధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘ది ఆర్ట్‌ ఆఫ్ లివింగ్‌’ ఫౌండర్‌ గురు రవిశంకర్ పుట్టినరోజు మే 13. ఈ సందర్భంగా ఆయన జీవితంపై సినిమాని నిర్మించనున్నట్లు లైకా గ్రూప్‌, మహావీర్‌ జైన్‌లు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఫ్రీ’ అనే టైటిల్‌ని ఖారారు చేశారు. 155 దేశాలలో 450 మిలియన్ల ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసిన గురుదేవ్ జీవితం నుంచి ప్రేరణ పొంది సినిమాని రూపొందిస్తున్నామని నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.

ఈ సందర్భంగా సన్‌డయల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత, చిత్ర నిర్మాత నీతూ మహావీర్‌ జైన్‌ స్పందిస్తూ..‘‘అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన గురుదేవ్ కథను రూపొందించడం నా హక్కు. దీనిని గౌరవంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ఇది రవిశంకర్‌ జీవితంపై తెరకెక్కే మొదటి చిత్రం. సినిమాకి మోంటూ బస్సీ కథను అందించారు. ఆయనే దర్శకత్వం వహించనున్నారు. మోంటూ గతంలో అనేక ప్రకటనలు రూపొందించారు. వాటికి పలు ప్రశంసలతో పాటు అనేక అవార్డులు వచ్చాయి. చిత్రానికి నీతు ఎమ్‌.జైన్‌, ప్రేమ సుభాస్కరన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఫ్రీ’ సినిమా ముఖ్య ఉద్దేశం మనిషి ఆలోచనల్లో పాజిటివిటీని పెంచడమేనని నిర్మాతలు తెలిపారు. త్వరలో ఈ సినిమాను 150 దేశాలలో 21 పైగా ప్రపంచ భాషలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని