బూటకపు ఆత్మహత్య.. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అరెస్ట్‌! - guy fakes his death police arrested
close
Published : 29/07/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బూటకపు ఆత్మహత్య.. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అరెస్ట్‌!

ముంబయి: సోషల్‌మీడియాలో కొంతమంది యూజర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలా ముంబయికి చెందిన ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోను చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇరవైఏళ్ల ఇర్ఫాన్‌ఖాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 44వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇటీవల అతడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇన్‌స్టాలో వీడియో పోస్టు చేశాడు. తనని ఒక అమ్మాయి.. ప్రేమించి మోసం చేసిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ రైల్వే ట్రాక్‌పై కూర్చున్నాడు. ఆ తర్వాత రైలు అతడిని ఢీకొట్టినట్లు వీడియోను ఎడిట్‌ చేసి అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీంతో బాంద్రా పోలీసులు ఇర్ఫాన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. రైల్వే చట్టాలు, భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. 

తాను ఈ వీడియోను ఆత్మహత్య చేసుకోకూడదని తెలియజేసే వీడియో సిరీస్‌లో భాగంగా తీశానని, నెటిజన్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఇర్ఫాన్‌ అంటున్నాడు. ఏదేమైనా తను పొరపాటు చేసినట్లు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాడు. తన ఖాతా నుంచి ఆ వీడియోను డిలిట్‌ చేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని