Cinema news: షారుఖ్‌ సరసన నయనతార.. నిజమెంత..! - has nayanthara to act with shah rukh khan
close
Published : 23/07/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: షారుఖ్‌ సరసన నయనతార.. నిజమెంత..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. ఆయన కాస్త గ్యాప్‌ ఎక్కువే తీసుకున్నా అభిమానులకు డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘పఠాన్‌’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు షారుఖ్‌. ఆ తర్వాత తమిళ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటించిన తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమా గురించి రెండు వార్తలు ఇప్పుడు బీటౌన్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో మొదటిది.. షారుఖ్‌ సరసన సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సందడి చేయనుందట. ఇక రెండో వార్త.. ఈ ప్రాజెక్టును పాన్‌ఇండియా సినిమాగా రూపొందించనున్నారట. అందుకే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి స్టార్‌డమ్‌ ఉన్న నయనతారను ఎంచుకున్నారట. మరో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్‌ నటి కనిపించనుందట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నయన్‌కు కథను వినిపించారట. ఆమె కూడా సినిమా చేసేందుకు సై అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నయన్‌ గతంలో అట్లీతో ‘రాజారాణి’తో హిట్‌ కొట్టింది. మరోవైపు షారుఖ్‌తో నటించే ఛాన్స్‌ కూడా వచ్చింది. దీంతో ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ కూడా చేసేయొచ్చు. ఈ సినిమాను వద్దనుకోవడానికి ఆమె దగ్గర పెద్ద కారణాలు కూడా ఏమీ కనిపించడం లేదు. కాబట్టి వార్తలు నిజమ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం షారుఖ్‌ఖాన్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘పఠాన్‌’లో నటిస్తున్నారు. అందులో దీపిక పదుకొణె హీరోయిన్‌. జాన్‌ అబ్రహం కీలకపాత్ర పోషిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేక అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. మరోవైపు నయనతార.. రజనీకాంత్‌ సరసన ‘అన్నాత్తే’లో నటిస్తోంది. విజయ్‌సేతుపతితో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే చిత్రంతో పాటు తెలుగులోనూ ఓ సినిమా చేస్తోందామె.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని