Cinema news: ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ చూశారా? - heads and tales official trailer
close
Updated : 17/10/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సునీల్‌, సుహాస్‌, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘అందరి కథలు ఒకే విధములు. కథనం మారే గతే బత్రుకులు.. నేను పంపిన మూడు సేమ్‌ కాపీలు.. ముగ్గురు అమ్మాయిల తలరాతలు అయ్యాయి చూడు’  అంటూ సునీల్‌ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం పోరాడాలని సూచిస్తుంది. యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులూ చూడాల్సిన సినిమా ఇది’ అని చిత్ర బృందం తెలిపింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని