సార్‌పట్ట: ఆంగ్లేయులపై పిడిగుద్దు - here the first look of sarpatta
close
Published : 28/03/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సార్‌పట్ట: ఆంగ్లేయులపై పిడిగుద్దు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించిన దర్శకుడు పా.రంజిత్‌. ఇప్పుడాయన ‘సార్‌పట్ట’ అనే మరో వైవిధ్యభరిత చిత్రంతో సినీప్రియుల్ని పలకరించబోతున్నారు. ఆంగ్లేయులపై రోషమైన పిడిగుద్దు.. ఉప   శీర్షిక. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న  చిత్రమిది. బాక్సింగ్‌ ఆట నేపథ్యంలో పీరియాడికల్‌ చిత్రంగా ముస్తాబు చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు ప్రచార చిత్రాన్ని నటుడు రానా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆర్య కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్‌ రింగ్‌లో ఎవరితోనో తలపడుతున్నట్లుగా కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఆదివారం ‘సార్‌పట్ట’ ప్రపంచాన్ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని