close
గుస‌గుస‌లు
మళ్లీ బయోపిక్‌లోసూర్య

కోడంబాక్కం, న్యూస్‌టుడే: సుధ కొంగర దర్శకత్వంలోని ‘సూరరై పోట్రు’ చిత్రంలో నటించారు సూర్య. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతున్నట్లు సమాచారం. డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరి దర్శకత్వంలోని చిత్రంలో నటించనున్నారు సూర్య. అనంతరం శివ దర్శకత్వంలో నటిస్తారు. ఇవి పూర్తయిన తర్వాత రాయన మళ్లీ ఓ బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘కూటత్తిల్‌ ఒరుత్తన్‌’ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సూర్య కూడా కథ విన్నారని, దీంతో వెంటనే ఆయన అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.