అల్లు అర్జున్ వద్దనుకున్న హిట్ చిత్రాలివే!
ఇంటర్నెట్ డెస్క్: ‘ఎర్ర తోలు కదా స్టైల్‌గా ఉంటాడనుకుంటున్నావేమో! మాస్.. ఊర మాస్’ అంటూ మాస్ లుక్‌లో దర్శనమిచ్చినా.. ‘మీరిప్పుడే కారు దిగారు నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అంటూ క్లాస్‌గా కనిపించినా.. అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోవాల్సిందే. ఆయన వేసే స్టెప్పులకు ఆశ్చర్యపడాల్సిందే. ‘విజేత’ చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేసిన బన్నీ ‘గంగోత్రి’ సినిమాతో కథానాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైవిధ్య కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. గతేడాది ‘అల వైకుంఠపురములో’తో ఘన విజయం అందుకున్న బన్నీ ఈ ఏడాది ‘పుష్ప’రాజ్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి ఈ 18 ఏళ్ల ప్రయాణంలో వివిధ కారణాలతో బన్నీ వదులుకున్న చిత్రాలేంటో మీకు తెలుసా? నేడు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలేంటో చూద్దాం..
* భద్ర
రవితేజ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చి హిట్ అందుకున్న చిత్రం ‘భద్ర’. ముందుగా ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌ని అనుకున్నారు దర్శకుడు. ‘గంగోత్రి’, ‘ఆర్య’ వంటి ప్రేమకథల తర్వాత యాక్షన్ చిత్రం చేసేందుకు నిరాకరించారట బన్ని.
* గీతగోవిందం
* అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్‌ని అమాంతం మార్చిన ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు ముందుగా అర్జున్ కోసమే అనుకున్నారట. అనివార్య కారణంగా ఈ రెండు సూపర్ హిట్ చిత్రాలు చేయలేకపోయారాయన.
* జగడం
రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జగడం’ బన్నినే చేయాల్సింది. కథ సిద్ధం చేసుకుని అల్లు అర్జున్‌తో తీయాలనుకునే సమయంలో దర్శకుడు సుకుమార్‌కి నిర్మాత దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చింది. దాంతో ఎమోషన్ అయిన సుకుమార్ అప్పటికప్పుడే రామ్ దగ్గరకి వెళ్లి కథ వినిపించారు. రామ్‌కి ఈ స్క్రిప్టు బాగా నచ్చడంతో అలా ఆయనతో ‘జగడం’ తీశారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేదు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?