ఒక్కటే స్పానిష్‌ చిత్రం.. ఐదు రీమేక్‌లు - hollywood crime thriller julias eyes remake in five languages
close
Published : 21/07/2021 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కటే స్పానిష్‌ చిత్రం.. ఐదు రీమేక్‌లు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని కథలు భాషతో సంబంధం లేకుండా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా అలాంటి ఓ అంతర్జాతీయ కథ మన భారతీయ దర్శకుల్ని ఆకట్టుకుంది. అందుకే వరసగా వివిధ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. అదే స్పానిష్‌ చిత్రం ‘జులియాస్‌ ఐస్‌’. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఐదు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవల తాప్సి ప్రధాన పాత్రలో ఆమె నిర్మాతగా ‘బ్లర్‌’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ‘జులియాస్‌ ఐస్‌’కి హిందీ రీమేక్‌. రితేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మరాఠా చిత్రం ‘అదృశ్య’. ఇదీ స్పానిష్‌ చిత్రానికి రీమేకే. ఇందులో మంజరీ ఫడ్నవీస్‌ కీలక పాత్రలో నటిస్తోంది. కబీర్‌లాల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మరాఠీతో పాటు బెంగాలీ, తమిళ, తెలుగు భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. బెంగాలీలో ‘అంతర్‌దృష్టి’ పేరుతో రీతూ పర్ణాసేన్‌ గుప్తా ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ‘ఉన్‌ పారవాయిల్‌’గా, తెలుగులో ‘అగోచర’గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోదరి అనుమానాస్పద మృతి వెనుకున్న రహస్యాన్ని చేధించే క్రమంలో నెమ్మదిగా తన చూపును కోల్పోయే ఓ మహిళ కథే ‘జులియాస్‌ ఐస్‌’.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని