
జీవిత భాగస్వామి గురించి స్పందించిన గాయని
హైదరాబాద్: ఎన్నో మధురమైన పాటలు పాడి తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు గాయని సునీత. తాజాగా ఆమె రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. రామ్‌తో జీవితంలోని కొత్త అంకాన్ని ఆరంభించడం తనకెంతో సంతోషంగా ఉందని తాజాగా సునీత అన్నారు.
‘నా సోషల్‌మీడియా ఖాతాలను కొన్ని సంవత్సరాల నుంచి రామ్ చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది స్నేహంగా మారింది. అలా మా బంధం మరింత బలపడింది. అలాంటి సమయంలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశాం. వాళ్లు ఎంతో సంతోషించారు. మా నిర్ణయాన్ని నా పిల్లలు ఆనందంగా స్వాగతించారు. నన్ను అర్థం చేసుకునే కుటుంబం నా సొంతం కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా’
‘కరోనా పరిస్థితుల రీత్యా అతి తక్కువ మంది కుటుంబసభ్యులతో గుడిలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇద్దరి కుటుంబాలు చాలా పెద్దవి కావడంతో పెళ్లికి 200 మంది వరకూ హాజరయ్యారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది’ అని సునీత తెలిపారు.
ఘనంగా సునీత-రామ్‌ల వివాహ వేడుక(ఫొటోగ్యాలరీ)
ఇదీ చదవండి
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?