Fahadh Faasil: అందుకే ఈ స్థాయిలో ఉన్నా.. - i am here because of them fahadh faasil on malik
close
Published : 15/07/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Fahadh Faasil: అందుకే ఈ స్థాయిలో ఉన్నా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సినిమాతోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌. 2002లో వచ్చిన ‘కైయెతుమ్ దూరత్‌’ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా సరిగా ఆడకపోగా ఫాజిల్‌కు తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఇక ఇదంతా తనకు వర్కౌట్‌ కాదని భావించి అమెరికా వెళ్లిపోయాడు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలనుకున్నాడో ఏమో.. 2009లో మళ్లీ ఇండస్ట్రీకి వచ్చాడు. విభిన్న కథలను ఎంచుకొంటూ తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు. కట్‌ చేస్తే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోనే కాదు యావత్తు దేశంలోనే గొప్ప నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘మాలిక్‌’ చిత్రం జులై 15న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫాహద్‌ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. 

‘నేను కథను నమ్మితేనే సినిమా చేస్తా. అందుకే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఎంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నా అది నా ఒక్కడి గొప్పతనం కానేకాదు. ప్రతి సినిమా వెనుక ఒక జట్టు శ్రమ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి వాళ్లు కూడా కారణం. ఇప్పుడు నాకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందంటే మలయాళ సినిమాకు కూడా మంచి రోజులు వచ్చినట్లే భావిస్తాను’’ అని ఫాహద్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘హింస అనేది ‘మాలిక్‌’లో చిన్న భాగం మాత్రమే. ప్రేమ, స్నేహం ఇలా సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ సినిమా భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇది మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా అని నా నమ్మకం’’ అని ఫాహద్‌ అన్నాడు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని