Nitin Gadkari: యూట్యూబ్‌తో ప్రతి నెలా నాకు ₹4లక్షలు.. ఎందుకంటే? - i get rs 4 lakh royalty per month from youtube says union minister gadkari
close
Updated : 18/09/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nitin Gadkari: యూట్యూబ్‌తో ప్రతి నెలా నాకు ₹4లక్షలు.. ఎందుకంటే?

భరూచ్‌: యూట్యూబ్‌ తనకు ప్రతి నెలా ₹4లక్షలు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లోనే ఉండి లక్షల రూపాయాలు ఆర్జించానన్నారు. గుజరాత్‌లోని భరూచ్‌లో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిపై సమీక్షించిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లో ఉంటూ రెండు రకాల పనులు చేశానని తెలిపారు. చెఫ్‌గా మారి ఇంట్లో వంట చేశానని, అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాన్యాసాలు ఇచ్చినట్టు చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తదితరులకు ఆన్‌లైన్‌లో దాదాపు 950కి పైగా ఉపన్యాసాలు ఇచ్చినట్టు తెలిపారు. వాటన్నింటినీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశానన్నారు. దీంతో తన యూట్యూబ్‌ ఛానల్‌కు వ్యూస్‌ పెరగడంతో ఆ సంస్థ ఇప్పుడు తనకు నెలకు రూ.4లక్షలు చొప్పున రాయల్టీగా చెల్లిస్తోందని వివరించారు. మరోవైపు, రహదారి నిర్మాణ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు తమ మంత్రిత్వశాఖ రేటింగ్‌ను ప్రారంభిస్తుందన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని