పోరాటం చేస్తూనే ఉన్నా: విశాల్‌ - i have been fighting it for a long time says vishal
close
Published : 25/03/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోరాటం చేస్తూనే ఉన్నా: విశాల్‌

చెన్నై: సినిమాల ఆన్‌లైన్‌ పైరసీపై కథానాయకుడు విశాల్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘ఎనిమీ’, ‘డిటెక్టివ్-2’ పనుల్లో బిజీగా ఉన్న విశాల్‌ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో కొంత సమయంపాటు ముచ్చటించారు. ఈ సమయంలో తన బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించారు. అలాగే దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లోకి.. బీటౌన్‌ సినిమాలు ఇక్కడికి రీమేక్‌ కావడంపై విశాల్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. అలాగే, ఏ సినిమాకైనా కథే హీరో. కథ బాగుంటే ఏ భాషా చిత్రానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా కాస్త విరామం దొరకడంతో దక్షిణాది, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషా సినిమాలను చాలామంది వీక్షించారు. ఈ క్రమంలోనే రీమేక్‌ల పరంపర కొనసాగుతోంది. దక్షిణాది చిత్రాల్లోని కథ, స్క్రీన్‌ప్లే.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే, మనం ఎన్నో సౌత్‌ ఇండియన్‌ చిత్రాల రీమేక్స్‌ చూస్తున్నాం’’

‘‘బిగ్‌స్క్రీన్‌ల్లోకి రాకముందే పలు చిత్రాలను ఆన్‌లైన్‌లో పైరసీ చేసేస్తున్నారు. అసలు ఈ సమస్యకు ఎవరిని నిందించాలో మీకు తెలుసా? సినిమా సంస్థలు, ప్రభుత్వ సైబర్ సెల్. ఎంతో కాలం నుంచి నేను పైరసీపై పోరాటం చేస్తున్నాను. దానిని రూపుమాపడానికి ఇప్పటికే కొంతమంది యువకులతో యాంటీ పైరసీ టీమ్‌ నిర్మించాను’’ అని విశాల్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని