ప్చ్‌.. ‘అర్జున్‌రెడ్డి’ని అనవసరంగా వదులుకున్నా: పార్వతీనాయర్‌ - i should not have missed arjun reddy movie says parvati nair
close
Published : 26/07/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌.. ‘అర్జున్‌రెడ్డి’ని అనవసరంగా వదులుకున్నా: పార్వతీనాయర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్‌ సినిమాల్లో చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.! సినిమా మంచి విజయం సాధించినప్పుడే కదా నటులకు మంచి గుర్తింపు వచ్చేది. అయితే.. అలాంటి సినిమానే చేజేతులా వదులుకుంటే ఎలా ఉంటుంది. చివరికి.. అరెరే అవనవసరంగా మంచి ఛాన్స్‌ మిస్సయ్యామే అని నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టాలీవుడ్‌ సంచలనం ‘అర్జున్‌రెడ్డి’ని వదులుకోవడంపై హీరోయిన్‌ పార్వతీనాయర్‌ స్పందించింది. సోషల్‌ మీడియాలో ఆమె నిర్వహించిన ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’లో భాగంగా ఓ అభిమాని ‘‘అర్జున్‌రెడ్డి’లో రొమాంటిక్‌ సన్నివేశాల కారణంగానే మీరు ఆ సినిమాను నిరాకరించారన్నది నిజమేనా..? ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పుడు చింతిస్తున్నారా?’’ అని ప్రశ్నించాడు. దానికి పార్వతీనాయర్‌ ఇలా స్పందించింది.. ‘‘ఔను నిజమే. అయితే.. అర్జున్‌రెడ్డి ఒక మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉండాల్సింది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని నమ్ముతున్నాను’’ అని ఆమె పేర్కొంది.

వివాదాలతో మొదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఆ సినిమా అటు హీరో విజయ్‌ దేవరకొండతో పాటు డైరెక్టర్‌ సందీప్‌రెడ్డికి హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘అర్జున్‌రెడ్డి’తో సినిమాతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఆకాశానికి తాకింది. ఆ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్‌ దృష్టిని కూడా ఆకర్షించింది. అందుకే హిందీలో ‘కబీర్‌సింగ్‌’ పేరుతో, తమిళ్‌లో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేశారు. కాగా.. పార్వతీనాయర్‌ తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘ఆలంబన’ చిత్రంలో నటిస్తోంది. అజిత్‌ హీరోగా వచ్చిన ‘ఎన్నై అరిందాల్‌’లోనూ ఆమె కనిపించింది. పలు వెబ్‌సిరీస్‌లు, లఘుచిత్రాల్లోనూ ఆమె సందడి చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని