ఇది తప్పుడు కేసు.. ఆధారాలతో వస్తా: నటుడు - i will come in front of you will all the evidence
close
Published : 30/04/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది తప్పుడు కేసు.. ఆధారాలతో వస్తా: నటుడు

వీడియో షేర్‌ చేసిన యాంకర్‌ శ్యామల

హైదరాబాద్‌: తనపై తప్పుడు కేసు పెట్టారని.. నిజానిజాలతో త్వరలోనే అందరి ముందుకు వస్తానని బుల్లితెర నటుడు, యాంకర్‌ శ్యామల భర్త లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మోసం కేసులో గత రెండు రోజుల క్రితం అరెస్టైన ఆయన తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సైతం తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. సదరు వీడియోని శ్యామల ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.

‘నాపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చినప్పటికీ నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ఆ దేవుడి దయ వల్ల నేను ఇంటికి తిరిగి వచ్చేశాను. గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో నా గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజానిజాలను మీతో పంచుకోవడానికి మరికొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తాను. కేసు ఏమిటి? అందులోని నిజానిజాలేమిటి? ఇలా అన్నిరకాల ఆధారాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు మీకే ఓ అంచనా వస్తుంది. న్యాయం, న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది తప్పుడు కేసు అనడానికి ఓ ఆధారాలతో నేను రెండు రోజుల్లోనే మీ ముందుకు రావడం. కొన్నిసార్లు ఇలాంటి నిందలు పడాల్సి ఉంటుంది. కానీ, వచ్చిన పుకార్లపై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది’ అని లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు.

గండిపేటలో రూ.100 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల స్థలం ఉందని, దాంట్లో ఈతకొలను, పబ్, గేమ్‌ జోన్‌ వంటివి అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదిస్తూ.. 2017 ఆగస్టులో తన వద్ద నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి రూ.85 లక్షలు నగదు తీసుకున్నాడని పేర్కొంటూ ఇటీవల ఖాజాగూడకు చెందిన సింధూరారెడ్డి ఆయనపై కేసు పెట్టింది. అంతేకాకుండా తన వద్ద నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు లక్ష్మీ నరసింహారెడ్డితోపాటు ఆయనకు సాయం చేసిన జయంతి గౌడ్‌ అనే మహిళను సైతం అరెస్టు చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని