Bapatla: సాగరం నుంచి నగరంలోకి రాములోరు - idol of rama is found on the coast of suryalanka beach
close
Published : 17/09/2021 22:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bapatla: సాగరం నుంచి నగరంలోకి రాములోరు

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరంలో రాముల వారి పురాతన విగ్రహం స్థానిక మత్స్యకారుల కంట పడింది. పురాతన రాతి విగ్రహం తీరంలోకి కొట్టుకొచ్చినట్టు గమనించిన మత్సకారులు స్థానిక పోలీసులకు సమాచారమందించారు. మెరైన్‌ పోలీసులు రాములోరి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విగ్రహం సముద్రపు అలలకు కొట్టుకొచ్చిందా? లేక ఎవరైనా తీసుకొచ్చి వదిలేశారా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు సచివాయల కార్యదర్శి బాబూరావు తెలిపారు. దీనిపై పురావస్తుశాఖ అధికారులకు సమాచారమందించినట్టు చెప్పారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని