ప్రెగ్నెన్సీపై స్పందించిన ఇలియానా  - ileana spills the beans on most bizarre rumours about herself
close
Updated : 05/05/2021 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రెగ్నెన్సీపై స్పందించిన ఇలియానా 

ఆనాటి వార్తలపై  గోవా బ్యూటీ ఏమన్నారంటే

ముంబయి: తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని గతంలో వచ్చిన వరుస కథనాలపై గోవా బ్యూటీ ఇలియానా తాజాగా స్పందించారు. చాలారోజుల తర్వాత ‘బిగ్‌బుల్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి  వైరల్‌గా మారిన వార్తలపై ఆమె స్పందించారు. చాలా సందర్భాల్లో తన గురించి ఎన్నో పుకార్లు బయటకు వచ్చాయని ఆమె అన్నారు. ‘‘గత కొన్ని సంవత్సరాల క్రితం ఆండ్రూ అనే వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  కొన్ని వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతో మేమిద్దరం 2019లో విడిపోయాం. అయితే, మేమిద్దరం రిలేషన్‌లో ఉన్న సమయంలో నేను గర్భం దాల్చానని, అలాగే అబార్షన్‌ చేయించుకున్నానని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ అబద్ధం. ఆ వార్తలు కేవలం అవాస్తవాలు మాత్రమే’’ 

‘‘ఆండ్రూతో నేను విడిపోయిన సమయంలో అందరిలానే నాకు కూడా ఎంతో బాధగా అనిపించింది. అదే సమయంలో నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని అందరూ చెప్పుకున్నారు. నేను బలవన్మరణానికి పాల్పడుతుంటే నా పనిమనిషి నన్ను ఆపిందని.. ఆమె వల్ల నేను ప్రాణాలతో ఉన్నానని అప్పట్లో  పుకార్లు వినిపించాయి. నిజం చెప్పాలంటే నేను ఆత్మహత్య ప్రయత్నాలు అస్సలు చేసుకోలేదు. అలాగే అసలు నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. నా గురించి ఇలాంటి వార్తలు బయటకు రావడం చూసి వింతగా అనిపించింది’’ అని తన గురించి వచ్చిన రూమర్స్‌పై ఇలియానా స్పష్టత ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని