The Family Man 2: ఈ ఐదుగురూ కీల‌క‌మే - important roles in familyman series
close
Published : 11/06/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Family Man 2: ఈ ఐదుగురూ కీల‌క‌మే

ఇంట‌ర్నెట్ డెస్క్‌: వెబ్ సిరీస్‌ల్లో కొత్త ఒర‌వ‌డి సృష్టించింది ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. 2019లో సీజ‌న్-1 విడుద‌ల‌కాగా సీజ‌న్-2 ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌ముఖ నాయిక స‌మంత కీల‌క పాత్ర పోషించ‌డంతో సీజ‌న్ 2కి విపరీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. రాజ్య‌లక్ష్మి (రాజి) పాత్ర‌లో ఒదిగిపోయి ఫిదా చేసింది సామ్‌. సీజ‌న్-1లో శ్రీకాంత్ తివారీగా క‌నిపించి న‌టుడిగా త‌నెంటో నిరూపించుకున్న‌ మ‌నోజ్ బాజ్‌పాయ్‌ సీజ‌న్ 2లోనూ అదే హ‌వా కొన‌సాగించి మెప్పించారు. ఈ రెండు మాత్ర‌మే కాదు, ఈ సిరీస్ లో మ‌రో ఐదు పాత్ర‌లు కీల‌కంగా నిలిచాయి. అవేంటి? వాటిని పోషించిందెవ‌రు?చూద్దామా...

ఉద‌య్ మహేశ్ (చెల్లమ్‌ స‌ర్‌)

పాత్ర చిన్న‌దే అయినా గట్టి ప్ర‌భావం చూపారు న‌టుడు ఉద‌య్ మహేశ్‌. చెల్ల‌మ్ స‌ర్ పాత్ర‌లో మెరిసి ప్రేక్ష‌కులకి కొత్త అనుభూతి పంచారాయ‌న‌. ఈ సిరీస్‌లో సుమారు 15 నిమిషాలపాటు క‌నిపించిన ఉద‌య్‌ టాక్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)లో పని చేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి చెల్లమ్. త‌మిళ రెబ‌ల్స్ కుట్ర‌ని తెలుసుకునేందుకు శ్రీకాంత్ తివారీ బృందానికి చెల్ల‌మ్ సహాయం చేస్తుంటాడు. క‌థ‌ని కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర కావ‌డంతో ప్ర‌తి ఒక్కరినీ ఇట్టే ఆక‌ట్టుకుంటున్నాడు చెల్ల‌మ్‌.

ష‌రీబ్ హ‌ష్మి (జేకే త‌ల్పాడే)

ఈ  క్రేజీ ప్రాజెక్టులో మ‌నోజ్, స‌మంత త‌ర్వాత అంద‌రి దృష్టిని ఆకర్షించిన న‌టుడు ష‌రీబ్ హ‌ష్మి. జేకే త‌ల్పాడేగా సీజ‌న్-1లో సంద‌డి చేసిన ష‌రీబ్ అదే పాత్ర‌తో సీజ‌న్-2లోనూ మెప్పించాడు. శ్రీకాంత్ తివారీ (మ‌నోజ్ బాజ్‌పాయ్‌) స్నేహితుడుగా త‌న‌దైన శైలిలో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. పాత్ర నిడివి త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ షరీబ్‌ అభిన‌యం చూపు తిప్పుకోనివ్వ‌దు.  వృత్తిప‌రంగా, వ్య‌క్తిగతంగా మ‌నోజ్‌కి సాయం చేసే మిత్రుడిగా ష‌రీబ్ పాత్ర‌ని తీర్చిదిద్దిన  తీరు ప్రేక్ష‌కుల‌న్ని క‌ట్టిపడేస్తుంది.

స‌న్నీ హిందుజ (మిలింద్)

సీజ‌న్-1లో స‌న్నీ హిందుజ పాత్ర నిడివి త‌క్కువ‌. ఆ లోటును సీజ‌న్-2లో భ‌ర్తీ చేశారు. సీజ‌న్-1లో అలా మెరిసి ఇలా వెళ్లిపోతుంది సన్నీ పాత్ర‌. సీజ‌న్ 2లో ఉన్నంత మేర వైవిధ్యంగా సాగుతుంది. త‌న భ‌యాన్ని అధిగ‌మించి ‘థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌ సెల్’ (టి.ఎ.ఎస్‌.సి)లో తిరిగి అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నించే అధికారి పాత్ర‌లో స‌న్నీ మైమ‌ర‌పించాడు.

ప్రియ‌మ‌ణి (సుచిత్ర తివారీ)

శ్రీకాంత్ తివారీ (మ‌నోజ్ బాజ్‌పాయ్‌) భార్య పాత్ర పోషించింది ప్రియ‌మ‌ణి. సుచిత్ర తివారీగా సీజ‌న్-1లో విశేషంగా అల‌రించిన ప్రియ‌మ‌ణి సీజ‌న్‌-2లోనూ ప్ర‌తి స‌న్నివేశాన్ని ర‌క్తి క‌ట్టించింది. తొలి సీజ‌న్‌లో.. భర్తతో గొడ‌వ‌లు సాగించి, త‌న‌కి న‌చ్చిన‌ట్టుగా వ్య‌వ‌హరించిన సుచిత్ర సీజ‌న్-2లో త‌న త‌ప్పు తెలుసుకుంటుంది. గృహిణిగా ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే వేశారు ప్రేక్ష‌కులు.

ర‌వీంద్ర విజ‌య్ (ముత్తు పాండియ‌న్‌)

ఈ సిరీస్‌లో ముత్తు పాండియ‌న్‌గా క‌నిపించి మెప్పించారు ర‌వీంద్ర‌ విజ‌య్‌. శ్రీకాంత్ తివారీ, జేకే త‌ల్పాడే, ముత్తు స‌హోద్యోగులు. జేకే త‌ల్పాడే పాత్ర కాస్త కామెడీగా సాగుతుంది. ముత్తు పాత్ర కొంచెం సీరియ‌స్‌గా ఉంటుంది. అయినా ఫ్యామిలీమ్యాన్-2లో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో ఇదీ ఒక‌టని క‌చ్చితంగా చెప్పొచ్చు. ‘ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకి గ‌తంలోనే ప‌రిచ‌యం అయ్యారు ర‌వీంద్ర‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని