Ram Charan: మొన్న సాయితేజ్‌.. ఇప్పుడు రామ్‌చరణ్‌ తేజ్‌..? - interesting role for ram charan in shankar
close
Published : 22/10/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram Charan: మొన్న సాయితేజ్‌.. ఇప్పుడు రామ్‌చరణ్‌ తేజ్‌..?

హైదరాబాద్‌: వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు యువ కథానాయకుడు రామ్‌చరణ్‌. ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నాయి. ఇక త్వరలో రామ్‌చరణ్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనున్నారు. పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ తారగణం నటిస్తోంది. కాగా, ఇందులో చెర్రీ పాత్రపై ఇప్పటికే అనేక గుసగుసలు వినిపించాయి.

తాజాగా టాలీవుడ్‌లో మరో టాక్‌ నడుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారనటి టాక్‌. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌లో టక్‌ చేసుకుని, టై కట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు. మరి రామ్‌చరణ్‌ పాత్ర ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. కియారా అడ్వాణీ కథానాయిక. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్నట్లు ఇటీవల విడుదలైన ‘రిపబ్లిక్‌’లో సాయితేజ్‌ కలెక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని