‘పీకే’కు సీక్వెల్‌.. హీరోగా రణ్‌బీర్‌కపూర్‌! - interesting update on pk sequel
close
Published : 21/02/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పీకే’కు సీక్వెల్‌.. హీరోగా రణ్‌బీర్‌కపూర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ హీరోగా 2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రూ.85కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.850కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. రాజ్‌కుమార్‌ హిరాణి ‘పీకే’ను తెరకెక్కించారు. ఆ చిత్రంతో అనుష్కశర్మ, సుశాంత్‌సింగ్‌, బొమన్‌ ఇరానీ, సౌరవ్‌ శుక్లా, సంజయ్‌దత్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే.. ఆ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

‘పీకే’లో అతిథి పాత్ర పోషించిన యువనటుడు రణ్‌బీర్‌కపూర్ రాబోయే సీక్వెల్‌లో ప్రధానపాత్ర పోషించనున్నాడట. ఈ వార్త బాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘పీకే’ నిర్మాత వినోద్‌ చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా.. రణ్‌బీర్‌కపూర్‌ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమాలో కింగ్‌ నాగార్జున నటించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని