
గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ఎవరైనా ఠక్కున గుర్తు పట్టేస్తారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘అప్పుల అప్పారావు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాస్యనటుడు.. తనదైన భారీ ఆకారం, అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో వెండితెరపై 150కిపైగా చిత్రాల్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి ఐరన్‌లెగ్ పంచిన వినోదాల విందు నాటికీ నేటికీ సినీప్రియుల మోములపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. నిజానికి ఆయన నటుడిగా మారడానికి ముందు సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేస్తుండేవారు.
ఐరన్ లెగ్గా ఈవీవీ ఆయనకు ఓ ఇమేజ్ క్రియేట్ చేశాక.. చిత్రసీమలో చాలా కాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. హాస్య నటుడిగా ఇంతగా అందరి మదిపై చెరగని ముద్ర వేసిన ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేక పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు.. తన స్క్రీన్ నేమ్ ఉపాధి కరవయ్యేలా చేసిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన స్వయంగా వెల్లడించారు.
సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రను ఎక్కువగా దరిద్రానికి, దురదృష్టానికీ సింబాలిక్‌గా చూపించి నవ్వులు పూయించారు. నిజానికి అది తెరపై పాత్రే అయినప్పటికీ.. ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యంతో చేసుకొని పొట్టపోసుకుందాం అనుకున్నప్పటికీ.. ఐరన్ లెగ్ ఎఫెక్ట్ వల్ల ఎవరూ ఆయన్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదట.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- అసహజ బంధం.. విషాదాంతం
- చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా