ఇంటర్నెట్ డెస్క్: నటి సమంత తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’. మనోజ్‌బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్ప్రైమ్లో ప్రసారమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు ఇది కొనసాగింపు. ఇటీవల వచ్చిన టీజర్లో సమంత లుక్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా అమెజాన్ ప్రైమ్ ఒక ట్విటర్ ఎమోజీని విడుదల చేసింది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు సమంత కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ తరహా ఎమోజీని దక్కించుకున్న భారతీయ మహిళా నటుల్లో సమంతనే ప్రథమం.
ఇదే విషయాన్ని సమంత ట్విటర్లో.. నిజంగానా అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఉంచింది. సైనికులు ధరించే యూనిఫాంతో సమంత సెల్యూట్ చేస్తునట్టు ఆ ఎమోజీ దర్శనమిస్తోంది. ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మాన్-2’హ్యష్‌టాగ్ సోషల్‌మీడియాలో ట్రెండవుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ విడుదల చేయనుంది. మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి ప్రధానపాత్రలో యాక్షన్, స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే!
ఇవీ చదవండి!
ఆ హీరోతో నాకో డీల్ ఉంది: రకుల్
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’