వెట్రి మారన్‌ దర్శకత్వంతో కమల్‌? - is this kamal and vetrimaran teams up for a project
close
Published : 01/07/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెట్రి మారన్‌ దర్శకత్వంతో కమల్‌?

చెన్నై: ‘ఆదు కలమ్‌’, ‘విశారణై’, ‘అసురన్‌’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్‌. ఇప్పుడు ఆయన ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌తో ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. కమల్‌హాసన్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సూరి ప్రధాన పాత్రలో ‘విధుతలై’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు వెట్రి. ఆయన గత ఏడాది సూర్యతో ‘‘వాడి వాసల్‌’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు ‘విధుతలై’ని పూర్తి చేసి తర్వాత కొత్త చిత్రాల పనిలో దిగనున్నారు వెట్రి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని