కృతి ‘మిమీ’ ఓటీటీలో? - is this kritisanon will release in ott
close
Published : 05/05/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృతి ‘మిమీ’ ఓటీటీలో?

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకు చాలా సినిమాలు మళ్లీ ఓటీటీల బాట పడుతున్నాయి. కృతి సనన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిమీ’ కూడా ఓటీటీవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సరోగేట్‌ తల్లిగా ఈ చిత్రంలో కృతి నటిస్తోంది. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని గత ఏడాది నుంచీ ఎదురుచూస్తున్నారు. కానీ వీలు కాలేదు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక ఓటీటీలోనే విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘‘ఓ ప్రముఖ ఓటీటీ ‘మిమీ’ చిత్రాన్ని మంచి ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ తీవ్రతగా ఎక్కువగా ఉంది. థర్డ్‌ వేవ్‌ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేయడయే మంచిదని చిత్ర నిర్మాత దినేష్‌ విజన్‌ భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది’’అని దినేష్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని