‘భాయీజాన్‌’గా మారుస్తారా? - is this new title for salman movie
close
Published : 07/05/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భాయీజాన్‌’గా మారుస్తారా?

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా ‘కభీ ఖుషీ కభీ ఈద్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరుని మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సాజిద్‌ ఓ కొత్త పేరుని రిజిస్టర్‌ చేయించారు. అదే ‘భాయీజాన్‌’. అది సల్మాన్‌ చిత్రం కోసమే అని తెలుస్తోంది. యాక్షన్, కామెడీతో సాగే ఈ చిత్రానికి, ఇలాంటి ఓ కథకు ఈ టైటిల్‌ అయితేనే సరిపోతుందని చిత్రబృందం భావిస్తోందట. పైగా ఈ టైటిల్‌ సల్మాన్‌ సినిమాకు వందశాతం కుదురుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆయుష్‌ శర్మ, జహీర్‌ ఇక్బాల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘భజరంగీ భాయీజాన్‌’ భారీ విజయం సాధించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని