తమిళంలో మరొకటి - is this sivathmika will going to play a key role in udayanidhi stalin movie
close
Published : 12/05/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళంలో మరొకటి

చెన్నై: కథానాయకుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌ తమిళంలో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది. ఆమె ప్రస్తుతం ‘అన్బరివ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడిది సెట్స్‌పై ఉండగానే ఆమె మరో కొత్త సినిమాకి సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని నిర్మాత బోనీ కపూర్‌ తమిళంలో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అరుణరాజా కామరాజ్‌ దర్శకుడు. తాన్య రవిచంద్రన్‌ ఓ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు మరో నాయికగా శివానీని ఎంపిక చేసుకున్నారని సమాచారం. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.    త్వరలోనే కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టనున్నారు. ఈ షెడ్యూల్‌లోనే శివానీ చిత్ర బృందంతో    కలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ అనే చిత్రంలో నటిస్తోంది. గుహన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని