తెలుగు హీరోతోనే? - is this sudha kongara net movie with telugu hero
close
Published : 25/04/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు హీరోతోనే?

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా సినిమాల ప్రభావంతో ఇప్పుడు భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. కథానాయకులు, దర్శకుల మార్కెట్‌ విస్తృతి మరింతగా పెరిగింది. అందుకే దర్శకులు కూడా ఎప్పుడు ఏ భాషకి చెందిన హీరోతో సినిమా చేస్తారో ఊహించలేని పరిస్థితి.మొన్నటివరకు కన్నడ హీరో యశ్‌తో సినిమా చేసిన... ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు తెలుగులో ప్రభాస్‌తో ‘సలార్‌’ చేస్తున్నారు. అది పాన్‌ ఇండియా సినిమాగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో రామ్‌ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నారు. అలా మహిళా దర్శకురాలు సుధ కొంగర కూడా తదుపరి తెలుగు కథానాయకులతోనే సినిమా చేయడానికి కథ సిద్ధం చేశారని సమాచారం. ఆమె ఇదివరకు తెలుగులో ‘గురు’ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతేడాది సూర్య కథానాయకుడిగా తెరకెక్కించిన ‘ఆకాశం నీ హద్దురా’ ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చక్కటి ఆదరణని సొంతం చేసుకుంది. స్వతహాగా తెలుగువారైన సుధ ఈసారి తెలుగు కథానాయకులతోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆమెతో జట్టు కట్టే ఆ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని