Tollywood: ‘జాను’ ఫుల్ వీడియో సాంగ్‌ వ‌చ్చేసింది  - jaanu full video out now from rap singer noel money she
close
Published : 17/06/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ‘జాను’ ఫుల్ వీడియో సాంగ్‌ వ‌చ్చేసింది 

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  ర్యాప‌ర్, న‌టుడు నోయ‌ల్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘మ‌నిషి’. పూజిత పొన్నాడ క‌థానాయిక‌. వినోద్ నాగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓటీటీ వేదిక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల  ముందుకు రాబోతుంది. జూన్ 18 నుంచి స్పార్క్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ‘జాను’ ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంది. సాహిత్యానికి త‌గ్గ‌ట్టు నాయ‌కానాయిక‌లు ప‌లికించిన‌ హావ‌భావాలు అల‌రిస్తున్నాయి. రాంబాబు గోసాల ర‌చించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించారు. వినోద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. స‌త్య‌నారాయ‌ణ నాగుల నిర్మించిన ఈ చిత్రానికి బ‌య్య‌వ‌ర‌పు ర‌వి క‌థ‌,  స్క్రీన్‌ప్లే అందించారు.
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని