‘అభి అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ : ఆది - jabardasth 400 Episode Special | Latest Promo
close
Updated : 24/12/2020 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అభి అన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ : ఆది

హైదరాబాద్: ‘జబర్దస్త్‌’లో కమెడియన్లు కేవలం నవ్వించడమే కాదు... వారి జీవితాల్లో ఎదుర్కొన్న సవాళ్లను, ‘జబర్దస్త్’తో వారి జీవితాలు ఎలా మారాయో భావోద్వేగమైన మాటలను పంచుకున్నారు. 400వ ఎపిసోడ్ సందర్భంగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ‘జబర్దస్త్’ స్టేజీపై ఆది, వెంకీ, అనసూయ వారు పడిన కష్టాలను చెప్తూ కంటతడి పెట్టారు. అలాగే ఈ షోకి యాంకర్‌ ప్రదీప్ మాచిరాజు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేశారు. అయితే వచ్చే గురువారం ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ 400వ స్పెషల్ ఎపిసోడ్‌కి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.

చాలా రోజుల తర్వాత హైపర్‌ ఆది స్కిట్లో ప్రదీప్‌ తనదైన శైలిలో అలరించారు. ఆది-ప్రదీప్‌-రోజా వరుస పంచులతో నవ్వులు పూయించారు. షోలో భాగంగా ప్రదీప్‌ ‘అబ్బాయి దృష్టిలో పెళ్లంటే.. చేసుకుందాం అనే ఆశతో మొదలుపెట్టి.. చూసుకుందాం అనే ఆవేశం వరకు వెళ్లి.. చివరకు మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం’ అంటూ సరదాగా పంచులతో కడుపుబ్బా నవ్వించారు. వెంకీ మంకీస్‌, రాకెట్ రాఘవ, చలాకీ చంటీ, తాగుబోతు రమేశ్ స్కిట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ స్పెషల్ నవ్వుల పరిమళాల్ని ఆస్వాదించాలంటే వచ్చే గురువారం (డిసెంబర్‌ 24)న ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ వినోదాన్ని చూడాల్సిందే.. అప్పటివరకు ఈ ప్రోమోను తిలకించండి...!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని