టైగర్‌-దిశా డేటింగ్‌.. జాకీ ఏమన్నారంటే - jackie shroff opens up on tiger shroff disha patani relationship
close
Published : 22/06/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌-దిశా డేటింగ్‌.. జాకీ ఏమన్నారంటే

ముంబయి: బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌, దిశాపటానీ డేటింగ్‌లో ఉన్నారంటూ ఎంతోకాలం నుంచి వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే, తమ ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకూ ఈ జంట అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. కాగా, తాజాగా తన కుమారుడు టైగర్ ప్రేమ వ్యవహారంపై నటుడు జాకీ ష్రాఫ్‌ స్పందించారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులని ఆయన అన్నారు. సుమారు ఆరేళ్ల నుంచి టైగర్‌ డేటింగ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ని టైగర్‌-దిశా అనుబంధం గురించి స్పందించమని విలేకరి కోరగా.. ‘అది టైగర్‌ వ్యక్తిగత జీవితం. 25 సంవత్సరాల వయసు నుంచే టైగర్‌ డేటింగ్‌లో ఉన్నాడు. టైగర్‌-దిశా మంచి స్నేహితులు. వాళ్లిద్దరి అనుబంధం భవిష్యత్తులో ఎంతవరకూ వెళ్తుందనే దానిపై నాకెలాంటి ఆలోచన లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను టైగర్‌ ఫోకస్‌ ప్రస్తుతానికి వర్క్‌ పైనే ఉంది. ప్రేక్షకులు మెచ్చుకునేలా మంచి చిత్రాలు అందించాలని అతను భావిస్తున్నాడు’ అని జాకీ వివరించారు. మరోవైపు టైగర్‌ సోదరి కృష్ణ సైతం.. తన అన్న ఆలోచనలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటానని తెలిపారు. టైగర్‌కు ఆనందాన్ని ఇచ్చేది తమకు కూడా సంతోషాన్ని అందిస్తుందని ఆమె అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని