రూ.175 కోట్ల బంగ్లాలోకి బ్యూటీ క్వీన్‌ - jacqueline fernandez to move into a rs 175 crore bungalow with her businessman boyfriend
close
Updated : 19/06/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.175 కోట్ల బంగ్లాలోకి బ్యూటీ క్వీన్‌

ప్రియుడితో కలిసి ఉండేందుకేనట..!

ముంబయి: శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చి బీటౌన్‌లో బ్యూటీ క్వీన్‌గా రాణిస్తున్నారు నటి జాక్వెలిన్‌ పెర్నాండేజ్‌. తన నటన, అందచందాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. తరచూ షూటింగ్స్‌, ఫ్యాషన్‌ షోలతో బిజీగా ఉండే ఈ భామ.. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ముంబయిలోనే ఓ ఖరీదైన ఇంటిని తీసుకుని అక్కడే ఉంటున్నారు. కాగా, జాక్వెలిన్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం ప్రతిఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రియుడితో ఎక్కువ సమయాన్ని గడపాలని ఈ బ్యూటీ భావిస్తున్నారట. దీంతో, ఈమె త్వరలోనే సుమారు రూ.175 కోట్లు ఖరీదు చేసే ఇంట్లోకి మకాం మార్చనున్నారట.

దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో జాక్వెలిన్‌ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారట. బిజినెస్‌ వ్యవహారాల రీత్యా భవిష్యత్తులో ముంబయిలోనే సెటిలవ్వాలని జాక్వెలిన్‌ ప్రియుడు భావిస్తున్నారట. ఇక, జాక్వెలిన్‌ సైతం తన ప్రియుడితో కలిసి ఉండాలనుకుంటున్నారట. దీంతో ఈ జంట ఇటీవల ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే జుహూలోని ఓ అందమైన కాలనీలో రూ.175 కోట్లు పెట్టి బంగ్లా కొనుగోలు చేశారట. తమ అభిరుచులకు తగ్గట్టు దాన్ని డిజైన్‌ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే త్వరలో జాక్వెలిన్‌ ఆ బంగ్లాలోకి మకాం మార్చే అవకాశాలున్నాయంటూ బీటౌన్‌లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త విన్న ప్రతిఒక్కరూ.. ‘వామ్మో’ ఇంత ఖరీదైన బంగ్లానా అని చెప్పుకుంటున్నారు. మరోవైపు.. జాక్వెలిన్‌ ఇటీవల ‘పానీ పానీ’ స్పెషల్‌ ఆల్బమ్‌తో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని