ఓటీటీలో ‘జగమే తంత్రం’: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - jagamethandhiram coming on 18th june
close
Published : 27/04/2021 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో ‘జగమే తంత్రం’: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళస్టార్‌ హీరో ధనుష్‌ ప్రధానపాత్రలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా సందడి చేయనుంది. జేమ్స్‌, కాస్మో, జొజూ జార్జ్‌, కలైయారసన్‌, సౌందరరాజన్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. ఈ చిత్రం మే 1న విడుదల థియేటర్లలో కావాల్సి ఉంది. కాగా.. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విడుదల తేదీని మారుస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘నన్నె కొంచెం లవ్వే చెయ్యె బుజ్జి’ అంటూ సాగే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని