
నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
ముంబయి: అతిలోక సుందరి, అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వికపూర్ తాజాగా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేశారు. ఫ్యాషన్, ఫిట్నెస్ పోస్టులతో తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉండే జాన్వి తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో మెప్పించారు. కరీనాకపూర్ - షారుఖ్ ఖాన్ జంటగా నటించిన ‘అశోక్’ చిత్రంలోని ‘సన్ సననా’ అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘బురిటో బెల్లీ డ్యాన్స్ సెక్షన్లను మిస్ అవుతున్నా’ అని పేర్కొన్నారు.
కాగా, జాన్వి షేర్ చేసిన వీడియోకు నెట్టింట్లో మంచి స్పందన లభించింది. నెటిజన్లు మాత్రమే కాకుండా మనీశ్ మల్హోత్ర, మహీప్ కపూర్, సంజయ్ కపూర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం జాన్విపై ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్‌గా డ్యాన్స్ చేసిందంటూ వరుస కామెంట్లు చేశారు. ‘దఢక్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన జాన్వి.. గతేడాది విడుదలైన ‘గుంజన్ సక్సేనా’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘దోస్తానా -2’, ‘రోహి అఫ్జానా’, ‘గుడ్‌లక్ జెర్రీ’ చిత్రాలు ఉన్నాయి.
ఇవీ చదవండి
ఆ డైలాగ్‌లన్నీ సింగిల్ టేక్‌లో చెప్పింది!
రామ్‌తో న్యూలైఫ్ సంతోషంగా ఉంది: సునీత
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!