‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
ఇంటర్నెట్ డెస్క్: ‘జాతి రత్నాలు’ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని, అందరూ థియేటర్లలో చూడాలని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. నవీన్ పొలిశెట్టి, ఫారియా అబ్దుల్లా జంటగా నటించారు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించారు. రాధన్ స్వరాలు సమకూర్చారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హన్మకొండలో ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్‌దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘ఏడాది పాటు థియేటర్లు మూతపడి ఉంటే మేమంతా ఎంతో భయపడ్డాం. కానీ.. మీరు ఆ భయాలన్నీ తొలిగిపోయేలా చేశారు. థియేటర్లు తెరవగానే ఇన్ని సినిమాలు విడుదలవడం, ఇన్ని హిట్లు రావడం మన దగ్గర తప్ప మరెక్కడా లేదు. తెలుగు ప్రేక్షకులను మించిన వాళ్లు లేరు. ‘జాతి రత్నాలు’ గురించి చెప్పాలంటే.. వీళ్లంతా నా కుటుంబ సభ్యుల్లాంటివాళ్లు. నవీన్, ప్రియదర్శి, రాహుల్.. మేమంతా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇది మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మార్చి 11న థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి’ అని విజయ్ అన్నాడు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’