జయసుధను ఇలా చూశారా..?
ఇంటర్నెట్ డెస్క్: అలనాడు హీరోయిన్గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. శతమానం భవతి, శ్రీనివాసకళ్యాణం, మహర్షి, రూలర్ చిత్రాల తర్వాత ఆమె తెరకు దూరంగా ఉంటున్నారు. ఇదంతా సరే.. ఇప్పుడీ చర్చ ఎందుకంటారా.? చర్చంతా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆమె కొత్త లుక్ గురించే. ఉన్నట్లుండి ఆమె వయసు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. మొన్నటి వరకూ మనకు కనిపించిన జయసుధకు ఇది పూర్తి భిన్నమై లుక్‌లో ఆమె ఉంది. నెరిసిన జుట్టుతో ఉన్న ఆమె లుక్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. దీంతో ఆమె లుక్‌ను చూసిన అభిమానులు కొంతమంది ఆందోళనకు గురయ్యారు కూడా.
‘‘జానకి కలగనలేదు..’ అనే కొత్త సీరియల్ త్వరలో మీముందుకు రాబోతోంది’ అని చెబుతూ ఆమె ఒక వీడియో పోస్టు చేశారు. ‘‘రాజ్‌కుమార్’ సినిమాలోని ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని’ అనే పాటకు శోభన్‌బాబుగారు నేను కలిసి కనిపించాం. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఆ పాట అప్పట్లో అందర్నీ బాగా అలరించింది. ఇప్పటికీ ఎక్కడ పాటల పోటీలు జరిగినా.. ఆ పాట ఎవరో ఒకరు పాడుతున్నారు’ అని ఆమె అన్నారు. అయితే. ఆమె కొత్త లుక్ వెనకాల ఉన్న కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం
-
‘మేజర్’ కోసం ఆరు భారీ సెట్లు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
-
Radhe: మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ వచ్చేసింది
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..