jyotika: 9ఏళ్ల చిన్నారి ఆ సీన్‌ చూసి.. తనపై జరిగిన లైంగికదాడిని బయటపెట్టింది - jyothikas ponmagal vandhal helps a rape victim to open up
close
Published : 25/09/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

jyotika: 9ఏళ్ల చిన్నారి ఆ సీన్‌ చూసి.. తనపై జరిగిన లైంగికదాడిని బయటపెట్టింది

సమాజంలో ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ చిత్రం ఎఫెక్ట్‌ 

చెన్నై: వినోదం పంచే సినిమాల కంటే సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేశాత్మక, ఆలోచింపజేసే విషయాలను.. తెరపై చూపించేందుకు ఇటీవలి కాలంలో తమిళ చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన చిత్రమే.. ‘‘పొన్‌మగళ్‌ వందాళ్‌’’. నటి జ్యోతిక ప్రధాన లాయర్‌గా నటించిన ఈ చిత్రమంతా...  సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలతో పాటు కోర్టులో అలాంటి కేసుల్లో బాధితులకు ఏమేరకు న్యాయం జరుగుతుంది అనే విషయం చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ చిత్రంలో కీలక సన్నివేశం ‘‘ పిల్లలు ఏ విషయాన్ని తమ తల్లిదండ్రుల వద్ద దాచకూడదు’’ అనే సీన్‌ని టీవీలో చూసిన తొమ్మిదేళ్ల చిన్నారి.. తనపై లైంగిక దాడి గురించి వెంటనే తల్లికి వెల్లడించింది. గతంలో ఆ చిన్నారి కుటుంబసభ్యుల్లోని 48ఏళ్ల వయస్సు ఉండే ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోని ఆ బాలిక..  ఆ సన్నివేశం చూడగానే.. ఆ వ్యక్తి తనను ఎలా వేధించాడో బయటపెట్టింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు..శనివారం ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నటి జ్యోతిక పంచుకున్నారు ‘‘ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి. ప్రతిసారీ ఒక మహిళ తనకు తానే అండగా నిలుస్తుంది. అలా తెలియకుండానే  ఎంతో మంది మహిళలకు తోడుగా నిలుస్తుంది’’ అని భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని