close
Published : 07/04/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 స్ఫూర్తి రగిల్చే వకీల్‌ సాబ్‌ ‘కదులు’ గీతం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా ‘కదులు కదులు’ అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీ కృష్ణ, హేమచంద్ర ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. 
‘దెబ్బ కొడితే పులి నేను ఆడదాన్నంటుందా.. తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా’ అంటూ సాగే ఈ గీతం మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో, బోనీ కపూర్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’, ‘కంటిపాప’ పాటలు శ్రోతల్ని అలరించాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని