MAA Election: కల్యాణ్‌రామ్‌ ఏమన్నారంటే? - kalyan ram is not participate in maa elections
close
Published : 24/06/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Election: కల్యాణ్‌రామ్‌ ఏమన్నారంటే?

స్పష్టతనిచ్చిన టీమ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు అంతకంతకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే నలుగురు నటీనటులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో కల్యాణ్‌రామ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో కల్యాణ్‌రామ్‌ సైతం పోటీ చేయనున్నట్లు నెట్టింట్లో వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై కల్యాణ్‌రామ్ టీమ్‌ స్పందించింది. ఆయన ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. అవన్నీ అవాస్తవాలేనని ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యామిలీ సపోర్ట్‌ ఏ అభ్యర్థికి ఉంటుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడుతున్నారు. ‘మా’ అభివృద్ధి, సభ్యుల సంరక్షణతోపాటు, ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు వంటి అంశాలను అజెండాగా చేసుకుని వీరందరూ ఎన్నికల బరిలోకి దిగారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ 27 మంది సభ్యులతో కూడిన తన ప్యానల్‌ని గురువారం ప్రకటించారు. జయసుధ, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనసూయ, బ్రహ్మాజీ, ఉత్తేజ్‌, బండ్ల గణేష్‌, సుడిగాలి సుధీర్‌ తదితరులు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోని సభ్యులు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని