Cinema News: ‘కల్యాణం’ సాంగ్‌ వచ్చేసింది - kalyanam lyrical song out from pushpaka vimanam
close
Updated : 18/06/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘కల్యాణం’ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గీతా షైనీ కథానాయిక. దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘కల్యాణం’ పాటను అగ్రకథానాయిక సమంత సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘కల్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను సిద్‌శ్రీరామ్‌ ఆలపించారు. ఈ చిత్రానికి రామ్‌ మిరియాల స్వరాలు అందించారు. విజయ్‌ దేవరకొండ సమర్పణలో కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని