
ముంబయి: బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్ మరోసారి వీరనారి అవతారమెత్తనుంది. ఆమె ఝాన్సీలక్ష్మీబాయిగా ప్రధాన పాత్రలో నటించిన ‘మణికర్ణిక’ 2019లో వచ్చి మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ రాబోతోంది. భారీ బడ్జెట్‌తో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే.. ఇప్పుడు అంతకు మించిన బడ్జెట్ పెట్టి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘మణికర్ణిక’ నిర్మాత కమల్‌జైన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయట. స్ర్కిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రంలో కంగనా.. యోధురాలైన కశ్మీర్ రాణిగా కనిపించనుందని తెలుస్తోంది. ఒక కాలు పోలియో బారిన పడినప్పటికీ ఆమె గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడిస్తుంది. ఇలా మరోసారి మహిళా యోధురాలిగా మెప్పించేందుకు కంగనా సిద్ధమైంది. ఆమె నటించిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ‘తేజస్’లో నటిస్తోంది. మరో సినిమా కూడా చేస్తోందామె. కాగా.. తాజాగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ 2022 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీటౌన్ వర్గాల సమాచారం.
ఇవీ చదవండి..
‘మణికర్ణిక’ వివాదం గురించి పెదవి విప్పిన దర్శకుడు
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!