రియాలిటీ షో హోస్ట్‌గా కంగన - kangana ranaut to host reality show
close
Published : 15/07/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రియాలిటీ షో హోస్ట్‌గా కంగన

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ కంగన రనౌత్‌ ఇప్పుడు హోస్ట్‌ అవతారం ఎత్తనుంది. ఇప్పటికే నటిగా నిరూపించుకున్న ఆమె ఇటీవల నిర్మాతగా మారి కొన్ని సినిమాలు తెరకెక్కిస్తోంది. ఇప్పుడు హోస్ట్‌గా ఓటీటీలోకి ప్రవేశించనుంది. అమెరికాలో ప్రసారమయ్యే రియాలిటీ షో ‘టెంప్టేషన్‌ ఐస్‌ల్యాండ్‌’ను పోలిన కార్యక్రమాన్ని భారత్‌లోనూ ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీయువకులు జంటలుగా కొంతకాలం పాటు కలిసి ఒక దీవిలో ఉంటారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించే కంగన వాళ్లకు ప్రేమ పాఠాలు చెప్పనుంది. సదరు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె ఇప్పటికే ఒప్పందంపై సంతకం కూడా చేసిందట. అతి త్వరలోనే ఆ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కంగన బాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాదిలోనూ కూడా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె నటించిన ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో పాటు ‘ధాకడ్‌’, ‘తేజాస్‌’, ‘మణికర్ణిక రిటన్స్‌’, ‘ఎమర్జెన్సీ’ వంటి చిత్రాలన్నీ దాదాపు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధానపాత్రలో ‘టికూ వెడ్స్‌ షెరూ’ అనే చిత్రాన్ని కూడా కంగన నిర్మిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని