kareena: పారితోషికం కాదు.. మహిళల గౌరవాన్ని పెంచాను - kareena kapoor about her remuneration
close
Published : 14/09/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

kareena: పారితోషికం కాదు.. మహిళల గౌరవాన్ని పెంచాను

ముంబయి: కథానాయికలకు హీరోలతో సమానంగా పారితోషికం దక్కడం లేదంటూ చాలా సందర్భాల్లో పలువురు నాయికలు బాహాటంగానే విమర్శలు చేశారు. తాజాగా కరీనా కపూర్‌ కూడా ఈ విషయంపై స్పందించింది. ‘రామాయణ’ పేరుతో తెరకెక్కనున్న ఓ పౌరాణిక కథలో సీత పాత్రలో కరీనా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని సీత పాత్ర కోసం ఆమె తన పారితోషికాన్ని రూ.12 కోట్లకు పెంచిందని సమాచారం. దీంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడింది.

‘‘హీరోలతో సమానంగా హీరోయిన్‌లకు పారితోషికం లేదనే విషయం గురించి కొన్నేళ్ల క్రితం ఎవరూ మాట్లాడలేదు. కానీ అలాంటివాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. పారితోషికం పెంచడం అనేది డిమాండ్‌ చేయడం కాదు...మహిళల గౌరవాన్ని పెంచడం’’అని చెప్పింది. కరీనాకు తాప్సి, ప్రియమణి లాంటి నాయికలు మద్దతుగా నిలిచారు. ‘రామాయణ’ చిత్రం అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకత్వంలో కరీనా కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని సమాచారం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని