కార్తికేయ తొలి చిత్రం.. విడుదలకు సిద్ధం - karthikeya final settlement
close
Published : 27/04/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్తికేయ తొలి చిత్రం.. విడుదలకు సిద్ధం

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ప్రేమతో మీ కార్తీక్‌’ చిత్రంతో నటుడిగా పరిచయమై, ‘ఆర్‌ఎక్స్‌ 100’తో యువతలో సంచలనం సృష్టించాడు కార్తికేయ. వీటి కంటే ముందే ‘ఫైనల్‌ సెటిల్‌మెంట్’ అనే చిత్రంలో నటించాడు. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని స్వీయ నిర్మాణంలో జమ్మలమడుగు మోహన్ కాంత్ తెరకెక్కించారు. హైదరాబాద్‌- వరంగల్‌ నగరాలకు చెందిన రెండు బృందాలు ఓ అనాథాశ్రమాన్ని దోచుకునే ప్రయత్నంలో వాళ్ల మధ్య ఏం జరిగిందనే ఆసక్తికర అంశాలతో రూపొందింది. ‘కార్తికేయ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో అతనిలోని నటుడ్ని గుర్తించి ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రని ఇచ్చినట్టు’ తెలిపారు దర్శక-నిర్మాత మోహన్‌ కాంత్‌. ఈ చిత్రానికి  సంగీతం: ఎస్.బి., కూర్పు: పవన్ మంగాల, ఛాయాగ్రహణం: జయంత్. పోసాని కృష్ణ మురళీ, ఆర్తి అగర్వాల్‌ ప్రధాన పాత్రధారులుగా ‘ఆపరేషన్‌ ఐపీఎస్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే మోహన్‌కాంత్‌.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని