బన్నీ పాటకు కార్తిక్‌ క్లాస్‌ డ్యాన్స్ - kartik aaryan danced to allu arjuns butta bomma and we are impressed
close
Published : 13/06/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ పాటకు కార్తిక్‌ క్లాస్‌ డ్యాన్స్

‘బుట్టబొమ్మ’ పాటతో మెప్పించిన బీటౌన్‌ స్టార్‌

ముంబయి: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అందాల సుందరి పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో.. అందులోని పాటలు కూడా అంతే హిట్‌ అయ్యాయి. తెలుగు వారు మాత్రమే కాదు.. క్రికెటర్లు, బాలీవుడ్‌ స్టార్లు కూడా ఈ పాటలకు ఫిదా అయ్యారు. తాజాగా ఇందులోని ‘బుట్టబొమ్మ’ పాటకు బీటౌన్‌ యువ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌ క్లాస్‌ స్టెప్పులేసి మెప్పించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘డ్యాన్స్‌ లైక్‌ కార్తిక్‌ ఆర్యన్‌’ అని పేర్కొన్నారు. పాటకు అనుగుణంగా ఆయన వేసిన వెస్ట్రన్‌ స్టెప్పులు చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. ‘కార్తిక్‌.. మీరు డ్యాన్స్ బాగానే చేసి ఉండొచ్చు.. కానీ డ్యాన్స్‌లో అల్లు అర్జున్‌ని ఎవరూ బీట్‌ చేయలేరు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘ప్యార్‌ కా పంచ్‌నామా’తో తెరంగేట్రం చేసిన కార్తిక్‌ ఆర్యన్‌.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ధమాకా’, ‘భూల్‌ భులయ్యా-2’ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు, ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ నిర్మించనున్న ‘దోస్తానా-2’ నుంచి కార్తిక్‌ తప్పుకున్న విషయం విదితమే.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని