ప్రేమలో పడ్డ సత్యనారాయణ్‌ - kartik aaryan to star in epic love saga satyanarayan ki katha
close
Published : 24/06/2021 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమలో పడ్డ సత్యనారాయణ్‌

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ ‘దోస్తానా 2’ చిత్రం నుంచి బయటికొచ్చాకా చాలా రోజులు వార్తల్లో నిలిచాడు. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌  జోహార్‌తో స్పర్థల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాలీవుడ్‌లో చర్చ వినిపిస్తోంది. కార్తీక్‌ తాజాగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘సత్యనారాయణ్‌ కీ కథ’ అనే పేరుని నిర్ణయించారు. ఈ సందర్భంగా కార్తీక్‌ ఓ వీడియోని పంచుకున్నారు. జాతీయ పురస్కార గ్రహీత, మరాఠా దర్శకుడు సమీర్‌ విద్వాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘దీని కోసం చాలామంది ప్రముఖులు పనిచేస్తున్నారు. వాళ్లలో జాతీయ పురస్కార గ్రహీతలు ఎక్కువగానే ఉన్నారు. సంగీతానికి ప్రాధాన్యమున్న అందమైన ప్రేమ కథ ఇది’’అని చెప్పారు కార్తీక్‌. ఈ ఏడాది చివరికి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కార్తీక్‌ నటించిన ‘ధమాకా’ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని